కౌమారీదేవి స్తోత్రం

ఏక వక్తం ద్వి నేత్రంచ చతుర్భుజ సమన్వితాం
జటామకుట సమాయుక్తాం హరితవర్ణాం సుయోవనాం
వరదాభయ హస్తాత్వాం వజ్ర శక్తిం చ ధారిణం
సర్వ లక్షణ సం వంద్యాం కౌమారీం త్వం విభావయేత్ !!

కౌమారీదేవి పూజా!! :-
శ్రావణ శుక్ల నవమ్యాం కౌమారీ దేవీ పూజా కార్యా|
సా పూర్వ విద్ధా గ్రాహ్యా|
వసురన్ధ్రయోరితి యుగ్మాగ్నివాక్యాత్|
తదుక్తం భవిష్యోత్తరే –
క్షీరషాష్టికభక్తేన సర్వభూతహితే రతః|
ఉపవాసపరో వీర నవమ్యాః పక్షయోర్ద్వయోః||
కౌమారీమితి వై నామ్నాం చండికాం పూజయేత్ సదా|
స యాతి పరమం స్థానం యత్ర దేవో మయా సహ|| ఇతి|
షష్టిభిర్దినైః పచ్యన్త ఇతి షాష్టికాః వ్రీహివిశేషాః తేషాం భక్తేన పిష్టేనేత్యర్థః|

శ్రావణ శుద్ధ నవమి యందు కౌమారీదేవి పూజను చేయవలెను. పరవిద్ధగా తిథిని గ్రహించవలెను. వసురంధ్రములనియుగ్మాగ్ని వాక్యములను లోగడ చెప్పియున్నారు.
క్షీరమునుగాని , పిష్టము (పిండిని) గాని స్వీకరించి ఉభయ పక్షములందలి నవమీ తిథులలో సర్వప్రాణుల హితముగోరి ఉపవసించు వారు కౌమారీనామముతో చండీదేవిని పూజించవలెను.
అట్టివాడు దేవీ దేవుల వద్ద గొప్ప స్థానమును పొందునని భవిష్యోత్తరపురాణము చెప్పుచున్నది. షాష్టికలనునవి ధాస్య విశేషము (అరవై దినములకు పండు ధాస్యము), ఆ పిండిని స్వీకరించవలెను. శుద్ధ నవమి అయినటువంటి నేడు సంధ్యకాలం దీపారాధన చేసి కౌమారీ దేవిని ప్రార్థించాలి.

దేవీ స్తోత్రాణి

* శ్రీ వారాహి దేవీ 108 అష్టోత్తర శతనామావళి
* శ్రీ వారాహి దేవీ స్తోత్రం
* కౌమారి స్తోత్రం
* వ్యూహ లక్ష్మీ మంత్రం