ఇన్గుర్తి శ్రీ లక్ష్మీనృసింహ సుప్రభాతమ్

కౌసల్యాసుప్రజా రామ! పూర్వాసంధ్యా ప్రవర్తతే |
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ !! 1

అర్ధం: కౌసల్యాదేవి యొక్క సత్సంతానమైన ఓ శ్రీరామా! తూర్పు తెల్లబారుచున్నది. దైనందిన కార్యములెన్నో చేయవలసియున్నది. ఓ నరశ్రేష్ఠా! శీఘ్రముగ నిదుర లెమ్ము.

ఉత్తిష్ణోత్తిష్ఠ గోవింద! ఉత్తిష్ఠ భవతారక |
ఉత్తిష్ఠ నరహర్యక్ష! కర్తవ్యం దైవమాహ్నికమ్ || 2

అర్ధం: శిష్ట సంరక్షణార్థమై భూమిపై అవతరించిన స్వామీ! ఓ పక్షివాహన! ఓ నరసింహమా! పగలు చేయవలసిన కార్యములు పెక్కు కలవు. నిద్రనుండి లే లెమ్ము.

మాతర్నమామి కమలే! జలజాతవిక్షే!
శ్రీవిష్ణుమానససరోజనివాసిని! శ్రీ: |
క్షీరాంబు రాశి తనయే! సరసీరుహాభే!
శ్రీ నారసింహదయితే! తవ సుప్రభాతమ్ || 3

అర్ధం: పద్మములవంటి ప్రసన్నమైన చూపులు కలదానా! ఓ కమలామాత! మహావిష్ణువు యొక్క మానసపద్మములో నివసించుదానివి నీవు. క్షీరార్ణవములో జన్మించిన దానివి. పద్మమువంటి మేనిఛాయ కలదానివి. నృసింహ స్వామి సతీమణియైన ఓ లక్ష్మీదేవి నీకు సుప్రభాతమగుగాక!

తవ సుప్రభాత మరవిందమందిరే!
భవతు ప్రపన్న జనతాపనోదిని |
అమరాధిపాది వనితాభిరర్చితే !
ఇన్గుర్తినాథ దయితే! క్షమానిధే || 4

అర్ధం: పద్మమే నివాసస్థానముగ కలదానా! ప్రపన్నజనులయొక్క తాపము తొలగించుదానా! అమరాధిపుడైన ఇంద్రుని పత్నియగు శచీదేవి మొదలగు దేవతా స్త్రీలచే అర్చింపబడినదానా! ఓ నృసింహస్వామిపత్నీ! నీకు సుప్రభాత మగుగాక.

ప్రహ్లాదముఖ్య సుజనాః సముపాస్య సంధ్యాం
గంగారుహాణి కుసుమాని మనోహరాణి |
ఆదాయ పాదయుగళం తవ పూజయంతి
ఇన్గుర్తివాసనృహరే! తవ సుప్రభాతమ్ || 5

అర్ధం: ప్రహ్లాద నారదాది భక్తులు ప్రాతః సంధ్యా నమస్కారముచేసి గంగాజలజాతము లైన పరిమళవంతములైన పద్మములను గ్రహించి నీ పాదపద్మములయందు పూజ చేయదలిచినారు. ఇనుర్తి గ్రామవాసీ! ఓ నృసింహస్వామీ! నీకు సుప్రభాతము పలుకుచున్నాము.

అంభోజ జాత సహితా స్సకలా నిలింపా:
త్రైవిక్రమం శ్రుతిహితం చరితం స్తువని |
వాచాం పతిః పఠతి వాసర శుద్ధి మారాత్
ఇన్గుర్తివాస నృహరే! తవ సుప్రభాతమ్ || 6

అర్ధం: చతుర్ముఖ బ్రహ్మ మొదలగు దేవుళ్ళు నీ త్రివిక్రమావతారంలోని సర్వజన దృష్టమైన స్వరూపమును చరిత్రమును ఎల్లపుడు స్తుతించుచున్నారు. భాషాపతియైన ఆదిశేషుడు పంచాంగ శ్రవణము చేయుచు దివస పవిత్రతను కొనియాడుచున్నాడు. ఓ ఇన్గుర్తి గ్రామవాసియైన నృసింహ! నీకు సుప్రభాతము. నిదురనుండి లెమ్ము.

ఈషద్వికస్వర మనోహర పుష్పగంధ:
సంవాతి వాయురనిశం తవ మందిరేస్మిన్ |
గ్రామ్యా జనా స్సముపయాంతి హి శుద్ధభక్త్యా
ఇన్గుర్తివాస నృహరే! తవ సుప్రభాతమ్ || 7

అర్ధం: కొంచెముగా వికసించిన మనోహరపుష్పముల సుగంధమును మోసుకొనివచ్చు మంచి వాయువు యీ నీ కోవెలలో వీచుచున్నది. గ్రామంలోని జనులు శుద్ధమైన భక్తితో నీ సన్నిధికి చేరియున్నారు. ఓ ఇన్గుర్తి గ్రామేశ్వర! నృసింహ! నీకీ నాటి ప్రభాతము శుభకరమగుగాక. నిద్రనుండి లెమ్ము.

ఉన్మీల్య నేత్రయుగళం పరిబుద్ధ్యకాలం
స్వాహారసంచయవిహారవిలగ్నచిత్తాః |
శాబాశ్చ పక్షి వితతేరభియా న్తి దిక్షు
ఇన్గుర్తివాస నృహరే! తవ సుప్రభాతమ్ || 8

అర్ధం: రెండు కళ్ళను తెలచి తెల్లవారినదని తెలుసుకొని తమ ఆహారమును అన్వేషించు టకై పక్షులు ఆకాశంలో విహరిస్తున్నవి. మహిళలు గృహ మార్జనాది కార్యములు చేస్తున్నారు. ఇన్గుర్తి గ్రామ వాసియైన ఓ నారసింహా! తెల్లవారినది లెమ్ము.

తౌర్యత్రీకం చ నటగాయకవైణికాశ్చ
భక్తి ప్రబుద్ధ హృదయాః సహకుర్వతే స్మ |
భవ్యే చ దివ్యనిలయే భయనాశకౌండే
ఇన్గుర్తివాస నృహరే! తవ సుప్రభాతమ్ || 9

అర్ధం: ఓ నరసింహస్వామీ! సంసారబాధలను నశింపజేసెడు నీ భవ్యమైన ఆలయము నందు నట, గాయక, వైణికులు వీణా వేణు మృదంగ ధ్వనులతో సహకరిస్తూ నీ గానము చేయుచున్నారు. వారి హృదయములు భక్తిపూర్ణములు. నిదుర నుండి లేలెమ్ము. నీకీ నాటి ప్రభాతము శుభకరమగుగాక.

భృంగావళీ చ మకరందరసార్దమత్త
ఝంకారగీతినివ హై:కరుణామివాప్తుం |
త్వాం భక్తరక్షణచణం బహుకర్తుమీష్టే
ఇన్గుర్తివాస నృహరే! తవ సుప్రభాతమ్ || 10

అర్ధం: నారసింహా! పుష్పములయందలి మకరందమును త్రాగుటచేత మత్తెక్కిన తుమ్మెదలు గుంపులుగా చేరి నీ కరుణను పొందుటకా యన్నట్లు తిరుగుచు నిన్ను సాత్త్వికునిగా, భక్తరక్షణదక్షునిగా చేయుటకై బహుప్రయత్నము చేయుచున్నవి. ఇది తెల్లవారినదనుటకు చిహ్నము నిద్రనుండి మేల్కొనుము, నీకీ ప్రాతఃకాలము శుభకరమగుగాక.

ప్రాతర్విబుద్ధ్య కృషకా: కృషికర్మనిష్ణా!
కేదారభూమి పరిషేచన తత్పరాశ్చ |
బాలా: ప్రసన్న హృదయాశ్చ పఠని పాఠాన్
ఇన్గుర్తివాస నృహరే! తవ సుప్రభాతమ్ || 11

అర్ధం: ప్రాతఃకాలముననే మేల్కొనిన కృషీవలులు (వ్యవసాయదారులు) తమ పంట పొలాలను తడుపుటయనెడు స్వకార్యమునందు నిమగ్నులైనారు. పిల్లలు ప్రాతః కాలమున లేచి ప్రసన్న హృదయంతో చదువుటలో నిమగ్నులైనారు. లేలెమ్ము, నీకీ ప్రాతఃకాలము శుభప్రదమగుగాక

నీరేజగర్భ సుఖసుప్త మదాళివర్గా:
హర్తుం శ్రియం కువలయస్య స్వనీలకాన్త్వా |
మత్తద్విపా ఇవమిథ: కలహాయమానా:
ఇన్గుర్తివాస నృహరే! తవ సుప్రభాతమ్ || 12

అర్ధం: కమలముల గర్భమునందు హాయిగా నిద్రించి మకరందపానమత్తములైన తుమ్మెదల గుంపులు నల్లకలువలకాంతిని అపహరించుటలో మత్తగజముల వలె పరస్పరము కలహించుకొనుచున్నవి. ఓ ఇనుగుర్తి గ్రామవాసీ! నరసింహా! నిద్రనుండి లేలెమ్ము. నీకీ ప్రాతఃకాలము శుభమును కలిగించుగాక.

శ్రీమన్నభీష్టవరదానవిలోలచిత్త!
నైషాదయోషిదనురాగవిహారభూమే!
లక్ష్మ్యైచ వక్షసి సుకల్పితపుష్పడోల!
ఇన్గుర్తివాస నృహరే! తవ సుప్రభాతమ్ || 13

అర్ధం: శ్రీమంతుడా! భక్తుల అభీష్టముల నిచ్చుటలో సంలగ్నమైన చిత్తము కలవాడా! చెంచులక్ష్మి యొక్క అనురాగమనెడు విశాలమైన విహారభూమి కలవాడా! ఉరమున లక్ష్మీదేవికి వైజయంతి యనెడు పుష్పమయ డోలికను కల్పించినవాడా! ఇన్గుర్తివాసీ! నరసింహ! నీకు సుప్రభాతమగుగాక.

గంగాది తీర్థసదృశం హృదిభావయన్తః
తాటాకశీతలజలం సువిగాహ్య పూతాః |
శ్రీవైష్ణవాః ఖలు వసంతి దిదృక్షవస్వాం
ఇన్గుర్తివాస నృహరే! తవ సుప్రభాతమ్ || 14

అర్ధం: తటాక జలమునే గంగాది పుణ్యతీర్థముగా హృదయంలో భావించి స్నాన మాచరించి పవిత్రులైన శ్రీవైష్ణవులు నిన్ను దర్శించదలంచినవారై నీ గుడిలో వేచియున్నారు. ఓ స్వామీ! వారికి దర్శనమిచ్చుటకై నిద్రనుండి మేల్కాంచుము. నీకీ నాటి ప్రభాత సమయము శుభదమగుగాక.

సేవాపరాః తవ విలోకనభాగ్యలుబ్దా:
బ్రహ్మేంద్రరుద్రమరుదాది నిలింపవర్గాః |
సింహాసనం శరణగా: పరితస్తపంతే
ఇన్గుర్తివాస నృహరే! తవ సుప్రభాతమ్ || 15

అర్ధం: సేవాతత్పరులైన బ్రహ్మరుద్రేంద్రాది దేవతలు నీ కరుణాకటాక్షపాతము నందు ఆశ కలవారై శరణార్థులై నీ సింహాసనముచుట్టు చేరి వేచియున్నారు. ఇనుర్తివాసా! నరసింహ! నిద్రను విడువుము. నీకు ఈనాటి ప్రభాతము క్షేమంకరమగుగాక.

త్వదృష్టిపాతపతితా: గరుడాదిముఖ్యా:
భక్తా: స్వకీయపదవీ పరిపాలనాయ |
త్వామేవ సర్వశరణం సతతం స్తువని
ఇన్గుర్తివాస నృహరే! తవ సుప్రభాతమ్ || 16

అర్ధం: నీ దృష్టికి పాత్రులైన గరుడాది ముఖ్యభక్తులు తమ పదవిని యెట్లు నిర్వర్తించ వలెనో తెలియగోరి, సర్వరక్షకుడవైన నిన్ను జేరి మాటిమాటికి స్తోత్రము చేయు చున్నారు. వారివారిని ఆయా కర్తవ్యములలో నిమగ్నులగునట్లు ఆదేశించవలసి యున్న నీవు నిద్రను విడువుము. నీకీరోజు ప్రభాతము సుప్రభాతమగుగాక.

సూర్యేందుభౌమ ప్రముఖగ్రహాశ్చ
స్వస్థానలోకేషు కృతప్రభావాః ||
త్వద్దాసదాసాః ప్రణమని నిత్యం
శ్రీ నారసింహేశ్వర! సుప్రభాతమ్ || 17

అర్ధం: సూర్యుడు, అంగారకుడు మొదలగు గ్రహములన్నియు తమ తమ స్థానములలో ప్రభావము కల్గియున్నవి. ఐనను నీ సన్నిధిలో నీ దాసులకు దాసులై నిత్యము ప్రణమిల్లుచున్నారు. ఓ నారసింహా! ఈశ్వరా! నీకు ఈనాటి ప్రభాతవేళ క్షేమమును కలిగించుగాక. లెమ్ము.

త్వద్భీషణాకృతివిలోకన భీతచిత్త:
ఆత్మాననే వితథయత్నకరో హిరణ్యః |
సింహస్య హస్తపతితో గజరాడివాసీత్
ఇన్గుర్తివాస నృహరే! తవ సుప్రభాతమ్ || 18

అర్ధం: నీ భయంకరమైన ఆకారముచే భీతిల్లిన హిరణ్యకశిపుడు తనను కాపాడు కొనుటలో నిష్ఫల ప్రయత్నము చేసినవాడై సింహము చేతిలో పడిన గజరాజువలె నశించియుండెను. ఓ నారసింహా! నిద్రనుండి జాగ్రద్దశకు రమ్ము. నీకు శుభమగుగాక. (వితధయత్నకర:=నరసింహస్వామి సభలో స్తంభం నుండి ఆవిర్భవించగా హిరణ్యకశిపుడు అతనిని చంపుటకై వేలాది సైనికులను పంపగా వారిని స్వామి కడతేర్చినాడు - భాగవత పురాణము).

నిత్యోపి భక్తస్తవ చ ప్రమాదం
సంభావ్య సత్యం హి బిభేతి నిత్యం |
మృత్యోశ్చ మృత్యుం కురుషే మహాత్మన్
ఇన్గుర్తివాసేట్! తవ సుప్రభాతమ్ || 19

అర్ధం: వైకుంఠవాసియై నిత్యము భగవంతుని పరాక్రమాదులను తెలిసినవాడైనా నిత్యుడు (జన్మ, జరా, మరణములు లేనివాడు) నీకెక్కడ శత్రువులవల్ల ప్రమాదము కలుగునేమోయని నిత్యము భీతిల్లుచున్నాడు. నీవు మృత్యువుకే మృత్యువు కదా! (మృత్యుర్యస్యోపసేచనం అని ఉపనిషద్వాక్యము). ఓ ఇన్గుర్తి గ్రామపాలక! నారసింహా! మేల్కాంచుము.

మచ్చర్ల వంశ్యనిజభక్తమనుగ్రహీతుం
శ్రీపర్వతాగ్ర సువిరాజిత దివ్యమూర్తీ!
వల్మీక, భూజపరిచిహ్నితవాసభూమే!
ఇనుర్తివాస నృహరే! తవ సుప్రభాతమ్ || 20

అర్ధం: మచ్చర్ల వంశమున జన్మించిన నీ భక్తుని అనుగ్రహించుటకు "నరసింహులబోడు” యను ప్రసిద్ధమైన చిన్నకొండపై వెలసిన స్వామీ! పుట్ట, వృక్షము నీవుండు స్థలమునకు గుర్తులుగా కల్గియున్నావు కదా! ఓ నారసింహ! నిద్రనుండి లెమ్ము.

ప్రహ్లాదపోష! పరిచిహ్నితశంఖచక్ర!
భూభృదుపస్థ! జగతీ జనతైకరక్ష!
శ్రీ బభ్రుకేశ! ధరణీధృత చిత్రవేష!
ఇన్గుర్తివాస నృహరే! తవ సుప్రభాతమ్ || 21

అర్ధం: ప్రహ్లాదపోషక! శంఖచక్రముల దాల్చినవాడా! పర్వతగుహనివాసీ! భువనజనులను రక్షించుటయే ప్రధానకర్తవ్యముగా కలవాడా! రాగివెంట్రుకలు కలవాడా! ధరణిలో విచిత్ర వేషముతో ఆవిర్భవించినవాడా! ఓ నరసింహా! నిద్రనుండి లేచి రమ్ము. నీకు క్షేమమగుగాక!

కందర్పదర్పహర శంభుమదఘ్నుమూర్తీ!
లక్ష్మ్యాశ్చ చేతసి భయప్రదఘోరమూర్త్ |
కాపట్యదుర్గుణవినాశకరోగ్ర దృష్టి
ఇన్గుర్తివాస నృహరే! తవ సుప్రభాతమ్ || 22

అర్ధం: మన్మథుని గర్వమునణచిన శివుడు శరభ రూపంలో వచ్చి నిన్ను వధింపబూనగా అష్టాస్య గండభేరుండ పక్షిరూపంలో వచ్చి అతని మదమునణచిన నారసింహ!! లక్ష్మీదేవి యొక్క మనస్సులో భయమును పుట్టించి ఘోరాకారమును ధరించిన వాడా! కాపట్యమనెడు దుర్గుణము పై క్రూరదృష్టిని ప్రసరింపజేసినవాడా ఇన్గుర్తిగ్రామవాసీ! ఓ నరసింహస్వామీ! నీకు ఈ నాటి ప్రభాతము శుభమగుగాక.

మీనాకృతే! కమఠరూప! వరాహమూర్తె
శ్రీ నారసింహ! బలిమర్దన! రామ! రామ!
శ్రీకృష్ణ! బుద్ధ! యవనాంతక! విశ్వరూప!
ఇన్గుర్తివాస నృహరే! తవ సుప్రభాతమ్ || 23

అర్ధం: మత్స్య, కూర్మ, వరాహ, వామన, నారసింహ, శ్రీరామ, పరశురామ, శ్రీకృష్ణ, బుద్ధ, కల్కి యనెడు దశావతారములను ధరించిన ఓ విష్ణుమూర్తీ! నరసింహ రూపా! నీకు సుప్రభాతమగుగాక.

ఏలాలవంగఘనసారసుసౌరభాఢ్యం
తీర్థం పవిత్రతులసీదళభావితం చ
ఆస్వాద్య చ వైష్ణవవరా: పురతో భవనై
ఇన్గుర్తివాస నృహరే! తవ సుప్రభాతమ్ || 24

అర్ధం: ఏలా లవంగ కర్పూరాది సుగంధ ద్రవ్యములతో కూడియుండి తులసీదళ పరిమళభరితములైన జలములతో తీర్థమును ఆస్వాదించి శ్రీవైష్ణవార్చకులు నీ కోవెల ద్వారమువద్ద వేచియుండి సేవింపదలచియున్నారు. ఇన్గుర్తిగ్రామ నృసింహా! నిద్రనుండి మేల్కొనుము. నీకు సుప్రభాతమగుగాక.

భాస్వానుదేతి వికచాని పయోరుహాణి
ప్రాప్య స్వనంతి పరితః కకుభోండజాశ్చ
శ్రీస్వామినో నియత మంగళశంసినస్తే
ధామాశ్రయంతి నరసింహ! తవ ప్రభాతమ్ || 25

అర్ధం: కమలబాంధవుడుదయించుచున్నందున పద్మములు వికసించుచున్నవి. పక్షులు ఆయా దిక్కులలో చేరి అవ్యక్తమధురంగా ధ్వనించుచున్నవి. శ్రీ సంప్రదాయ నిష్టాగరిష్ఠులైన విష్ణుభక్తులు నియమముగా నీకు మంగళాశాసనము గావించు చున్నారు. వారిప్పుడు నీ ధామము (కోవెల)ను చేరియున్నారు. ఓ నరసింహా! నిద్రవిడచి లెమ్ము. నీకు సుప్రభాతము పాడుచున్నాము.

క్షేత్రార్పణేన భవత: మహితాద్దిరాజ
వంశ్యా: భవస్తే తవ పూర్ణకటాక్షపాత్రం
నారాయణేన యమినా కలితధ్వజాఢ్య!
ఇన్గుర్తివాస నృహరే! తవ సుప్రభాతమ్ || 26

అర్ధం: ఓ నారసింహా! ఒద్దిరాజు వంశస్థులు నీ కోవెలలోని రామానుజుడను భక్తునికి తమ సస్య కేదారమును సమర్పించి నీ కటాక్షమునకు పాత్రులైనారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌స్వామి మంగళాశాసన పురస్పరమైన ధ్వజ స్తంభమును నీ కోవెలలో ప్రతిష్ఠింపచేసుకొనినావు. అట్టి నీవు నిదురను విడువుము. నీకీ నాటి ప్రభాతము శుభములు కూర్చుగాక.

పద్మానివాస! పరితోషితబాలభక్త!
భక్తాంతరంగసరసీరుహవాసిభృంగ॥
వేదైకవేద్యనుతదివ్యగుణస్వరూప
ఇన్గుర్తివాస నృహరే! తవ సుప్రభాతమ్ || 27

అర్ధం: లక్ష్మీదేవికి నివాసభూతుడా! బాలుడైన భక్త ప్రహ్లాదుని శీతల దృష్టితో సంతోష పెట్టినవాడా! భక్తుల యొక్క అంతరంగములనెడు పద్మమునందు నివసించు తుమ్మెద ఐనవాడా! కేవల వేదముచేతనే తెలుసుకొనదగిన గొప్ప దివ్యస్వరూప, గుణములు కలవాడా! ఓ నృసింహస్వామీ! నీకు సుప్రభాతము.

శ్రీవైష్ణవాః దశదినాంచితదివ్యసూరి
గ్రంథాన్తపాఠనపరాః తవ దివ్యసేవాం
చక్రుర్షి లక్ష్మణమునీంద్ర జయన్తికాలే
ఇన్గుర్తివాస నృహరే! తవ సుప్రభాతమ్ || 28

అర్ధం: శ్రీవైష్ణవులు పూర్వము నీ భక్తుని (రామానుజుల) జన్మదిన వేడుకను దశదిన దివ్యప్రబంధ పారాయణముతో నిర్వహించి యుండెడివారు. అట్టి వైభవో పేతుడ వైన మర్యసింహా! లేలెమ్ము. నీకు సుప్రభాతము పాడుచున్నాము.

ఇన్గుర్తివాస నృహరే రిహ సుప్రభాతమ్
యేమానవా అహరహ: పఠితుం సుసక్తాః
తేషాం ప్రభాత సమయే స్థిరభక్తిభాజాం
సంసారతాపశమనాభిధమోక్షసిద్ధిః || 29

అర్ధం: ఈ విధముగా ఇనుగుర్తి గ్రామవాసియైన నృసింహస్వామియొక్క సుప్రభాత మును ప్రతిదినము ఏ మానవులు శ్రద్ధతో అనుసంధింతురో ప్రాతఃకాలము నందు సత్యగుణసంపన్నులై స్థిరదైవభక్తి ప్రపూర్ణులైన ఆ మానవులకు సంసార తాప వినాశరూపమైన మోక్షము సిద్ధించును.